CONGRESS WORKING COMMITTEE IS SET TO MEET ON SATURDAY FOR THE SECOND TIME IN THE DAY RAHUL ATTENDS THE MEETING MK
కొనసాగుతున్న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తు...భేటీకి హాజరైన రాహుల్...
సోనియా, రాహుల్ , మన్మోహన్
ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీయే కొనసాగాలని అత్యధిక ఎంపీలు, పీసీసీ చీఫ్‌లు, రాష్ట్రాల నేతలు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెబుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం రాత్రి రెండోసారి సమావేశమైంది. కాగా ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీయే కొనసాగాలని అత్యధిక ఎంపీలు, పీసీసీ చీఫ్‌లు, రాష్ట్రాల నేతలు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన రాజీనామాను వెనుకకు తీసుకునేది లేదని రాహుల్ గాంధీ శనివారం ఉదయమే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ నియామకం కోసం ఆ పార్టీ సీనియర్ నేతలలంతా తీవ్రంగా మేథో మధనం చేస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు అయిదు బృందాలుగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే సమావేశం ఆరంభంలో కొద్దిసేపు పాల్గొన్న సోనియా, రాహుల్ గాంధీలు ఆ తర్వాత సమావేశం మధ్యలోనే వోళ్లిపోయారు. అయితే అధ్యక్ష పదవి రేసులో ముకుల్ వాస్నిక్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నా.. ఎవరు పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారో ఇంకా స్పష్టత ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే రేపు వాయనాడ్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.