సభలో ఖాళీ కుర్చీలు..ఫొటోలు తీసిన జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన కార్యకర్తలు

ఖాళీ కుర్చీలను ఫొటోలు తీసిన జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. జర్నలిస్టులను దూషిస్తూ.. ఇష్టానుసారం చితక్కొట్టారు. విలేఖరులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: April 7, 2019, 12:19 PM IST
సభలో ఖాళీ కుర్చీలు..ఫొటోలు తీసిన జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన కార్యకర్తలు
జర్నలిస్ట్‌పై కాంగ్రెస్ నేతల దాడి
  • Share this:
దేశంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు రాజకీయ నేతలు. కొన్ని సభలు జనాలతో కిక్కిరిసిపోతుండగా..మరికొన్ని సభలు మాత్రం ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. తమిళనాడులోని విరుధునగర్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ సభకు జనాలు అంతగా రాలేదు. సభలో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపించాయి. ఐతే ఈ ఖాళీ కుర్చీలను ఫొటోలు తీసిన జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. జర్నలిస్టులను దూషిస్తూ.. ఇష్టానుసారం చితక్కొట్టారు. విలేఖరులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ మేగజైన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ ఎన్నికల సభను కవర్ చేసేందుకు వెళ్లాడు. ఐతే అక్కడ జనాలు ఎక్కువగా లేకపోవడంతో ఖాళీ కుర్చీలను ఫొటో తీశాడు. అది చూసిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఫొటోలు డిలీట్ చేయాలని బెదిరించారు. కానీ అందుకు ఆ జర్నలిస్ట్ ఒప్పుకోకపోవడంతో దాడికి తెగబడ్డారు. బాధితుడికి మద్దతుగా మరికొందరు జర్నలిస్టులు రావడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పత్రికా విలేఖరులపై మూకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని..ఆ కోపాన్ని జర్నలిస్ట్‌లపై చూపడమేంటని ధ్వజమెత్తారు.
First published: April 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు