• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS WORKERS DRESSED IN GRADUATION ROBES AND HATS SELL PAKODAS TEA TO MOCK BJP GOVT MS

మోదీకి కౌంటర్.. గ్రాడ్యుయేట్ డ్రెస్‌లో పకోడీలు అమ్మిన యువత..

మోదీకి కౌంటర్.. గ్రాడ్యుయేట్ డ్రెస్‌లో పకోడీలు అమ్మిన యువత..

పకోడీలు అమ్ముతున్న నిరుద్యోగ యువత

'నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా, పకోడీ బండ్లు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి..' కొన్నాళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగంపై చేసిన వ్యాఖ్యలివి.

  • Share this:
    'నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా, పకోడీ బండ్లు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి..' కొన్నాళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగంపై చేసిన వ్యాఖ్యలివి. ఆయన వ్యాఖ్యలను ఎద్దేవా చేసేలా శనివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ మెగా ర్యాలీలో పలువురు యువకులు గ్రాడ్యుయేట్స్ డ్రెస్ ధరించి పకోడీలు,టీ అమ్మారు. 'మోదీతో ఏదైనా సాధ్యమే' అనే బోర్డులను మెడలో తగిలించుకుని.. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విలఫమైందని నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా పలువురు యువకులు తమ మెడలో ఉల్లి దండలు ధరించారు.

    మెగా ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడిన ప్రతీ మాటకు యువకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. 'మోదీ ఉంటే నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, మోదీ ఉంటే ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణ అవుతుంది,మోదీ ఉంటే పలు ప్రభుత్వ కంపెనీలను అమ్ముతారు,మోదీ ఉంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది,మోదీ ఉన్నందుకే 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు' అంటూ ప్రియాంక విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కూడా ఒకింత ఆవేశంగా మాట్లాడిన మాటలకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందంటూ కాంగ్రెస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

    ఇది కూడా చదవండి : 'ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. ఐయామ్ రాహుల్ గాంధీ'
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు