Home /News /politics /

CONGRESS WONT MAKE FAKE PROMISES LIKE PM MODI AND ARVIND KEJRIWAL SAYS RAHUL GANDHI IN PUNJAB MKS PAH

అబద్ధాలు, తప్పుడు వాగ్దానాలు కావాలా? అయితే PM Modi మాటలు వినండి: Rahul Gandhi

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అకాలీదళ్ చీఫ్ బాదల్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వాగ్దానాలు కావాలంటే పంజాబీలు ఆ ముగ్గురి సభలకు వెళ్లాలని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొలది పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ హీట్​ను పుట్టిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ మోదీని, అరవింద్​ కేజ్రీవాల్​ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను నిజాలు మాత్రమే మాట్లాడుతాను. తప్పుడు వాగ్ధానాలు కావాలంటే మోదీ, కేజ్రీవాల్, బాదల్ మాటలు వినొచ్చు..’అని కాంగ్రెస్ నేత ఎద్దేవా చేశారు. పాటియాలా జిల్లాలో ఎన్నికల ప్రచారం (Election Campaigns)లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘నవీ సోచ్​ పంజాబ్​’ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్​పురాలో బహిరంగా సమావేశంలో ప్రసంగించారు.

రాహుల్ గాంధీ​ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వంటి తప్పుడు వాగ్దానాలు చేయనని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మంగళవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్​ను అభివృద్ధి పథంలో నడిపించిన అనుభవం ఉందని, రాష్ట్రాన్ని మరింత అగ్రగామిగా తీసుకెళ్లడానికి ప్రజల ఆశీర్వాదం కావాలని పేర్కొన్నారు.

Ukraine Crisis: తప్పిన యుద్దం ముప్పు! -రష్యా బలగాలు వెనక్కి -అయినా రెచ్చగొడుతోన్న నాటో


పంజాబ్​ ప్రజలు కొత్తవారిని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇవ్వరని రాహుల్​ అన్నారు. కరోనా కష్టకాలంలో ఢిల్లీలో కేజ్రీవాల్​ విఫలమయ్యారని దుయ్యబట్టారు. అనేక ఆసుపత్రులలో సరైన ఆక్సిజన్​ దొరక్క ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని గుర్తుచేశారు. ఢిల్లీకి సరైన సదుపాయాలు కల్పించలేని అరవింద్​ కేజ్రీవాల్​, పంజాబ్​కు ఏం చేస్తారని రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Ukraine Crisis: అణు యుద్దం తప్పదన్న పుతిన్.. అదే జరిగితే ప్రపంచ విధ్వంసం ఇలా..


ఇప్పటికే అధికార కాంగ్రెస్​ పార్టీ తిరిగి గద్దెను ఎక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి పక్షాలు కూడా తమదైన శైలీలో కాంగ్రెస్​కు గట్టిపోటీని ఇస్తున్నాయి. పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ పంజాబ్​​ లోక్​ కాంగ్రెస్ ఏర్పాటు చేసి, సుఖ్​దేవ్​ సింగ్​ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్​(సంయుక్త్​)తో పొత్తుపెట్టుకున్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఈసారి పంజాబ్​లో పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. కాగా, 117 అసెంబ్లీ స్థానాలున్న(Assembly Elections) పంజాబ్​కు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Congress, Punjab, Rahul Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు