సీట్ల లెక్క: కాంగ్రెస్ 90, ఇతరులకు 29?

ఆయా పార్టీలకు అంత బలం లేదు కాబట్టి.. సింహభాగం సీట్లలో తామే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

news18-telugu
Updated: September 12, 2018, 10:41 PM IST
సీట్ల లెక్క: కాంగ్రెస్ 90, ఇతరులకు 29?
కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేసిన విపక్షాలు
  • Share this:
తెలంగాణలో మహాకూటమి మధ్య సీట్ల లెక్క దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు తీసుకుని మిగిలిన అన్ని మిత్రపక్షాలకు 29 సీట్లను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ లెక్కలకు సంబంధించిన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత సింహభాగం సీట్లు తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ బలహీనపడింది. ఏపీలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. అయితే, ప్రస్తుతం ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి.. ఆ ప్రాంతంలో హస్తం పార్టీకే బలం ఎక్కువగా ఉంది. కాబట్టి.. ఎక్కువ సీట్లు తీసుకుని, మిగిలిన సీట్లను మిత్రపక్షాలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.

సీట్ల లెక్కలకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీడీపీకి ఎలాగూ బలం లేదు కాబట్టి.. ఇచ్చినన్ని స్థానాల్లో పోటీ చేయక తప్పదనే భావన హస్తం పార్టీ నేతల్లో కూడా ఉంది. కానీ, ఇటీవల టీటీడీపీ నేతలు నిర్వహించిన సమావేశంలో తెలంగాణలో పార్టీకి ఇంకా బలం తగ్గలేదని.. కనీసం 40 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, మిగిలిన పార్టీలకు కూడా సర్దుబాటు చేయాలి కాబట్టి.. కాంగ్రెస్ 90 పోగా, మిగిలిన 29 సీట్లలో టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కే చాన్స్ ఉంది. సీపీఐ కూడా తమకు కొన్నిచోట్ల పట్టు ఉందని చెబుతోంది. టీజేఎస్ కూడా మహాకూటమిలో ఉంటే.. ఆ పార్టీ కూడా ఎక్కువ సీట్లను ఆశించే అవకాశం ఉంది.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందే సీట్ల లెక్కల మీద క్లారిటీ ఇచ్చేస్తే.. ఆ తర్వాత సమస్యలు వచ్చే చాన్స్‌లు కూడా ఉన్నాయి. మొదట సీట్ల వివరాలు బయటకు వస్తే.. ఆ తర్వాత ఎవరెవరు ఏయే సీట్లలో పోటీ చేయాలన్న చర్చ వస్తుంది. ఆ సందర్భంగా టికెట్లు రాని నేతలు రెబల్స్‌గా మారే అవకాశం ఉంది.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...