నవంబర్ 30న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ..

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి తెలంగాణ నుంచి 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని, ప్రతీ నియోజకవర్గం నుంచి 10మంది కార్యకర్తలు సభకు తరలివస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: November 16, 2019, 3:39 PM IST
నవంబర్ 30న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'భారత్ బచావో' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అలాగే దేశంలోని పలుచోట్ల నవంబర్ 5 నుంచి నవంబర్ 15 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. శనివారం కాంగ్రెస్ కార్యదర్శులు,రాష్ట్ర కమిటీల అధ్యక్షులు,కాంగ్రెస్ సీఎల్పీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.బీజేపీ విఫల విధానాలను ఎత్తిచూపుతూ అన్ని రాష్ట్రాల్లో,జిల్లాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి తెలంగాణ నుంచి 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని, ప్రతీ నియోజకవర్గం నుంచి 10మంది కార్యకర్తలు సభకు తరలివస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం,నిరుద్యోగం వంటి సమస్యలను బీజేపీ పక్కదారి పట్టిస్తుండటాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: November 16, 2019, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading