తెలంగాణలో మళ్లీ మహాకూటమి... హుజూర్ నగర్ బరిలో...

తెలంగాణలో మరోసారి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

news18-telugu
Updated: September 25, 2019, 12:01 PM IST
తెలంగాణలో మళ్లీ మహాకూటమి... హుజూర్ నగర్ బరిలో...
మహాకూటమి నేతలు (ఫైల్ ఫోటో)
  • Share this:
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ హవాలో మహాకూటమి ప్లాన్ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్నికల్లో కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం చేసిన ఈ పార్టీలు... ఆ తరువాత మళ్లీ కలిసి పని చేయలేదు. అయితే తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మళ్లీ మహాకూటమి ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో నిలుస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్, బీజేపీ కూడా రెడీ అయిపోయాయి.

అయితే ఇక్కడ పోటీలో ఉండే అంశంపై టీడీపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ నేతలు హుజూర్ నగర్‌లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా చేసేందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే హుజూర్ నగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి మహాకూటమి అభ్యర్థిగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో ఒకసారి విఫలమైన మహాకూటమి... మళ్లీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పురుడు పోసుకుంటుందా అన్నది త్వరలోనే తేలనుంది.
Published by: Kishore Akkaladevi
First published: September 25, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading