రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది. ఆయనను రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. గోవింద్ దోత్రాను రాష్ట్ర పీసీసీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేసింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి వచ్చేందుకు నిరాకరించడంతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్‌ను పదవి నుంచి తప్పించాల్సిందే అని పట్టుబడుతున్న సచిన్ పైలట్‌పై అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో సచిన్ పైలట్ బంధం దాదాపుగా ముగిసినట్టయ్యింది.
అంతకుముందు రాజస్థాన్‌లో రెండో రోజు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఈ సమావేశానికి తన వర్గం ఎమ్మెల్యేలతో రావాల్సిందిగా సచిన్ పైలట్‌ను కోరింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం, అహ్మద్ పటేల్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలంతా కలిసి సచిన్ పైలట్‌కు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయితే సచిన్ పైలట్ మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోవైపు అశోక్ గెహ్లాట్ వైపు ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు... సచిన్ పైలట్‌పై చర్యలు తీసుకోవాలని సీఎల్పీలో తీర్మానం చేశారు. దీంతో సచిన్ పైలట్‌ను కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది.
Published by:Kishore Akkaladevi
First published:July 14, 2020, 13:56 IST