Home /News /politics /

ప్ర‌తీ ఎంపీ పార్టీకి విరాళం ఇవ్వాలి: ఎంపీల‌కు కాంగ్రెస్ పార్టీ సూచ‌న‌

ప్ర‌తీ ఎంపీ పార్టీకి విరాళం ఇవ్వాలి: ఎంపీల‌కు కాంగ్రెస్ పార్టీ సూచ‌న‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ద‌శాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం నిధుల లేమితో అవ‌స్థ‌లు ప‌డుతోంది. దీంతో పార్టీ పొదుపు చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌ని పార్టీ స‌భ్యుల‌కు సూచించింది. అంతే కాకుండా ప్ర‌తీ పార్ల‌మెంట్ స‌భ్యుడు సంవ‌త్స‌రానికి రూ.50,000 ఇవ్వాల‌ని అంతే కాకుండా పార్టీపై అభిమానం ఉన్న క‌నీసం ఇద్ద‌రి నుంచి ఏటా రూ.4,000 విరాళం సేక‌రించాల‌ని సూచించింది.

ఇంకా చదవండి ...
    దేశంలో 135 ఏళ్ల చ‌రిత్ర గ‌ల కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం నిధులు  లేక ఇబ్బంది ప‌డుతుంది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన విరాళాలు బాగా తగ్గాయి. 2018-19లో రూ.383 కోట్ల మేర ఎన్నిక‌ల బాండ్లు రాగా.. 2019-20లో 318 కోట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ నిధుల సేక‌ర‌ణ పొదుపు చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది. పార్టీ కోశాధికారి ప‌వ‌న్ బ‌న్సాల్ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు లేఖ‌ల ద్వారా ఈ విష‌యం తెలియజేశారు.
    పార్టీలోని ప్ర‌తీ స‌భ్యుడు తమ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాల‌ని సూచించారు. కొందరు ఎంపీలు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఉన్నారు. వారికి ప్ర‌భుత్వం నుంచి ల‌భించే విమాన సౌక‌ర్యాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించింది. ఇక‌పై కార్య‌ద‌ర్శులుగా ఉన్న‌వారికి 14,000 కి.మీ లోపు రైలులోనే ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. అది దాటితే త‌క్కువ శ్రేణి విమాన చార్జీలు చెల్లిస్తామ‌ని వెల్లడించారు. అది కూడా నెల‌కు రెండు సార్లు.. విమాన చార్జీలు రైలు టికెట్ క‌న్నా త‌క్కువ ఉంటేనే చెల్లిస్తామ‌న్నారు. ఇక‌మీద ప్ర‌తీ ఎంపీ ఏటా రూ.50,000 విరాళం ఇవ్వాల‌ని అంతే కాకుండా పార్టీపై అభిమానం ఉన్న క‌నీసం ఇద్ద‌రి వ‌ద్ద నుంచి ఏటా రూ.4,000 విరాళం సేక‌రించాల‌ని సూచించింది.
    పార్టీ స‌భ్యులు ఇత‌ర ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌కి ఇచ్చే రూ.15,000 కార్య‌ద‌ర్శ‌కి ఇచ్చే రూ.12,000 భృతిలో కోత‌లు విధించారు. కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే బీజేపీ విరాళాలు ఏడాదిలో రూ.1,450కోట్ల నుంచి రూ.2,555 కోట్ల‌కు పెరిగాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bjp, Congress, India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు