Bihar Elections 2020: బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక, శతృఘ్న సిన్హా

Bihar Elections 2020: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు, సీనియర్లు పలువురు పాల్గొననున్నారు. ఈ మేరకు తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ...కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.

news18-telugu
Updated: October 10, 2020, 9:02 PM IST
Bihar Elections 2020: బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక, శతృఘ్న సిన్హా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(File Photo)
  • Share this:
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. ఈ నెల 28న తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.  ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార ఎన్డీయే కూటమిలోని జేడీయు-బీజేపీతో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి తలపడుతోంది. లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయనుంది. రెండ్రోజుల క్రితమే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్న  21 మంది పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది.  బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు, సీనియర్లు పలువురు పాల్గొననున్నారు. ఈ మేరకు తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ...కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.

ఈ జాబితాలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, సచిన్ పైలెట్, కీర్తి ఆజాద్, బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు.




బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికలను అక్టోబర్ 28, రెండో విడత ఎన్నికలు నవంబరు 3, మూడో విడత ఎన్నికలు 7 తేదీల్లో నిర్వహించనున్నారు. నవంబరు 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి విడతలో 71 అసెంబ్లీ స్థానాలు, రెండో విడతలో 94 స్థానాలు, మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Published by: Janardhan V
First published: October 10, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading