• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS STAR CAMPAIGNER VIJAYASHANTI PHOTO IN TPCC ADVERTISEMENT

పంతం నెగ్గించుకున్న రాములమ్మ... కాంగ్రెస్ ప్రకటనలో విజయశాంతి

పంతం నెగ్గించుకున్న రాములమ్మ... కాంగ్రెస్ ప్రకటనలో విజయశాంతి

విజయశాంతి(ఫైల్ ఫోటో)

టీ పీసీసీ ఇస్తున్న ప్రకటనల్లో మహిళలకు ప్రాధాన్యత లేదని అలక వహించిన విజయశాంతికి... కాంగ్రెస్ ఈ సారి ప్రాధాన్యత కల్పించింది. రాహుల్, చంద్రబాబు కలిసి పాల్గొనబోయే సభ కోసం ఇచ్చిన ప్రకటనలో విజయశాంతికి టీ పీసీసీ చోటు కల్పించింది.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పంతం నెగ్గింది. అయితే ఆమె మాట నెగ్గింది ఏ సీటు కేటాయింపు విషయంలో అనుకుంటే పొరపాటే. టీ పీసీసీ ఇస్తున్న ప్రకటనల్లో మహిళలకు ప్రాధాన్యత లేదని అలక వహించిన విజయశాంతికి... కాంగ్రెస్ ఈ సారి ప్రాధాన్యత కల్పించింది. రాహుల్, చంద్రబాబు కలిసి పాల్గొనబోయే సభ కోసం ఇచ్చిన ప్రకటనలో విజయశాంతికి టీ పీసీసీ చోటు కల్పించింది. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ మహిళా నేతలను పక్కనపెట్టి... ఒక్క విజయశాంతికి మాత్రమే కాంగ్రెస్ తమ ప్రకటనలో చోటు కల్పించడం విశేషం. దీంతో గతంలో ఆమె వ్యక్తం చేసిన అసంతృప్తి సెగ టీ పీసీసీకి గట్టిగానే తగిలిందనే టాక్ వినిపిస్తోంది.

    టీ పీసీసీ ఇచ్చిన ప్రకటనలో విజయశాంతి


    కొద్ది రోజుల క్రితం తెలంగాణలో సోనియాగాంధీ సభకు సంబంధించి మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. టీఆర్ఎస్‌తో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్న విజయశాంతి... మరి సోనియాగాంధీ సభ ప్రకటనలో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా ? అంటూ సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సభలో మహిళలు కూడా పాల్గొంటారని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై తన అసంతృప్తిని టీ పీసీసీ పెద్దల దగ్గర విజయశాంతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏదేమైనా... మీడియా ప్రకటన విషయంలో రాములమ్మ తన పంతం నెగ్గించుకున్నట్టు అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: