బీజేపీకి కాంగ్రెస్ మద్దతివ్వాలి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో శివసేనకు కాకుండా బీజేపీకి మద్దతివ్వాలని తన పాత మిత్రుడైన కాంగ్రెస్‌కు సూచించారు కుమారస్వామి. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 18, 2019, 11:04 PM IST
బీజేపీకి కాంగ్రెస్ మద్దతివ్వాలి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
దేవేంద్ర ఫడ్నవీస్
  • Share this:
మహారాష్ట్రలో పవర్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రోజుకో మలుపుతో ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్,ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తోంది శివసేన. మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బీజేపీ, శివసేన మధ్య 3-2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. మూడేళ్లు బీజేపీ, రెండేళ్లు శివసేన సీఎం పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇలాంటి పరిణామాల మధ్య మరాఠా రాజకీయాలపై కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేనకు కాకుండా బీజేపీకి మద్దతివ్వాలని తన పాత మిత్రుడైన కాంగ్రెస్‌కు సూచించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కుమారస్వామి.

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 1/3 కాకుండా.. 1/2 రాజకీయం చేస్తే బాగుటుంది. బీజేపీది సున్నితమైన హిందూత్వ అజెండా. కానీ శివసేనది కఠినమైన హిందూత్వ ఎజెండా. అలాంటి శివసేన పార్టీతో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది. అలాచేయకుండా సున్నితమైన హిందూత్వ ఎజెండా గల బీజేపీలో కలిస్తే బాగుంటుంది. ఇది ఇంకా సులభతరం.
కుమార స్వామి, కర్నాటక మాజీ సీఎం
karnataka politics,karnataka,karnataka political crisis,karnataka floor test,karnataka crisis,karnataka news,karnataka assembly,karnataka politics crisis,karnataka political news,politics,karnataka politics latest news,karnataka trust vote,new twists in karnataka politics,karnataka government,karnataka congress mla,bjp in karnataka,karnataka assembly live,karnataka politics moves towards climax,కర్ణాటకం,కర్ణాటక,కర్నాటక,కుమారస్వామి,బీజేపీ,యడ్యూరప్ప,
కుమారస్వామి


ఇక కర్నాటకలో త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో జేడీఎస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కుమారస్వామి. 8 నుంచి 10 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తామని స్పష్టం చేశారు. కాగా, డిసెంబరు 5న కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
First published: November 18, 2019, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading