కాంగ్రెస్‌లో రేవంత్ దుమారం.. హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే ఛాన్స్..

రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికిపిలుపునివ్వడంపై తమకెవరికీ సమాచారం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్,కోదండరెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలువురు మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 8:12 AM IST
కాంగ్రెస్‌లో రేవంత్ దుమారం.. హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే ఛాన్స్..
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 23, 2019, 8:12 AM IST
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి దూకుడు ఆ పార్టీ నాయకులకు నచ్చడం లేదు. పార్టీలో తమకంటే జూనియర్ అయిన రేవంత్.. చాలా విషయాల్లో తమను లెక్క చేయడం లేదని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నిన్న మొన్నటిదాకా హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలో రేవంత్‌కు,కాంగ్రెస్ నేతలకు మధ్య వివాదాలు బహిర్గతమవగా.. తాజాగా 'ప్రగతి భవన్ ముట్టడి'తో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికిపిలుపునివ్వడంపై తమకెవరికీ సమాచారం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలువురు మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు. ఎవరిని సంప్రదించి రేవంత్ ముట్టడికి పిలుపునిచ్చారని ప్రశ్నించారు. దానికి తగ్గట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముట్టడిలో పాల్గొనాలని మీడియా ప్రకటన ఇవ్వడమేంటని వాపోయారు. పార్టీలో రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

అంతకుముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్న వీహెచ్.. అక్కడ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిపై తమకు సమాచారం లేదన్నారు. మొత్తం మీద పైకి అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పినా.. లోలోపల మాత్రం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...