Revanth Reddy: రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి(ఫైల్ పోటో)

Revanth Reddy: రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఆ పార్టీని ముంచేశాడని... ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా ఖతం చేస్తాడని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు.

  • Share this:
    రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే.. తనతో పాటు చాలామంది నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని అన్నారు. పార్టీ కోసం పని చేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు టీపీసీసీ చీఫ్ పదవికి పనికిరారా ? అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీపీసీసీ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పదవులు కొత్త వాళ్లకు ఇస్తే.. మేం మాత్రం జైలు చుట్టూ తిరగాలా అని వ్యాఖ్యానించారు.

    2018 నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తనకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. ఓ వర్గం తనను హైకమాండ్‌ను కలవకుండా చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఆ పార్టీని ముంచేశాడని... ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా ఖతం చేస్తాడని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు.

    V hanumcoronavirus,covid19,congress leader vh,v hanumantharao,telangana,hyderabad,కరోనావైరస్,కోవిడ్19,వీహెచ్‌కు కరోనా పాజిటివ్,వి.హనుమంతరావుantha rao to quit congress,V hanumantha rao to join bjp soon,congress leader vh,ex rajya sabha member v hanumantha rao,vh shock to congress,కాంగ్రెస్‌ను వీడనున్న వీహెచ్,బీజేపీలోకి వి హనుమంతరావు,కాంగ్రెస్ నేత వీహెచ్
    వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)


    ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చిందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌లకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త టీపీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్... మరో ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సైతం కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యమైన పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అత్యున్నత విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి తీసుకోవాలని ఆ పార్టీ అధినాయత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. ఇందుకోసం పోటీ పడుతున్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి చర్చలు జరపనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదనకు ఎంతవరకు అంగీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

    ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీని బలంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడినే టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయాలని.. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక మంది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న ఢిల్లీ పెద్దలు.. వారిలో మెజార్టీ అభిప్రాయానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

    ఈ విషయంలో కొందరు నేతల ఒత్తిడికి తలొగ్గితే.. పరిస్థితి మరింత ఇబ్బంది మారుతుందనే భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ ఎక్కువగా ఉన్న ప్రస్తుతం తరుణంలో కాకుండా... మరికొద్ది రోజులు సమయం తీసుకున్న కొత్త టీపీసీసీ చీఫ్ పేరును ప్రకటించాలనే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారని... అంతకంటే ముందు కాంగ్రెస్ నేతలను పిలిపించుకుని మాట్లాడాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: