వీహెచ్ అలక.. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బాయ్‌కాట్..

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని సీనియర్ నేత వీహెచ్ బాయ్‌కాట్ చేశారు.

news18-telugu
Updated: December 26, 2019, 1:31 PM IST
వీహెచ్ అలక.. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బాయ్‌కాట్..
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని సీనియర్ నేత వీహెచ్ బాయ్‌కాట్ చేశారు. ఎవరిని పడితే వాళ్లను సమావేశానికి పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కోర్ కమిటీలో ఉండాల్సిన సభ్యులు కాకుండా, ఇతరులు కూడా సమావేశానికి హాజరవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు పడితే వాళ్లు కోర్ కమిటీ సమావేశాల్లో కూర్చుంటే.. ఇక కోర్ కమిటీ నిర్ణయాలకు విలువ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల ముందే వీహెచ్ ఫైర్ అయినట్టు సమాచారం.

కాగా, కోర్ కమిటీపై కూడా వీహెచ్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గతంలో పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహానికి అవమానంపై సరైన కార్యాచరణ నిర్ణయించలేదని కమిటీపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజా కోర్ కమిటీ సమావేశంలోనూ చర్చించాలని ఆయన భావించినట్టు సమాచారం. అయితే సభ్యులుగా లేనివారు కూడా

కమిటీ సమావేశానికి రావడంతో.. వచ్చీ రాగానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Published by: Srinivas Mittapalli
First published: December 26, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading