• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS SENIOR LEADER DIGVIJAY SINGH DEMANDS PROOFS FOR INDIAN AIR FORCE SURGICAL STRIKE PS

సర్జికల్ స్ట్రైక్స్‌పై డౌట్ లేదు.. మరి సాక్ష్యాలెక్కడ?: దిగ్విజయ్ సింగ్

సర్జికల్ స్ట్రైక్స్‌పై డౌట్ లేదు.. మరి సాక్ష్యాలెక్కడ?: దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(ఫైల్ ఫోటో)

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్‌పై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత జవాన్లు చేసిన ఈ మెరుపుదాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మాత్రం సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

  • Share this:
    పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్‌పై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత జవాన్లు చేసిన ఈ మెరుపుదాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మాత్రం సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భారత వాయుసేన జరిపిన దాడికి సంబంధించి ఆధారాలు, ఫొటోలు బయటపెట్టాలన్నారు.  పాకిస్తాన్‌లోని బాలకోట్ ప్రాంతంలో భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్ మీద తమకెలాంటి అనుమానాలు లేవన్నారు దిగ్విజయ్. అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం.. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు బయటపెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదని దిగ్విజయ్ అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టిన సందర్భంలో అమెరికా ప్రభుత్వం.. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఆధారాలను ప్రపంచానికి చూపిందన్నారు. అలాగే భారత్ కూడా పాకిస్తాన్ బాలకోట్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన ఫొటోలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

    2011లో జరిగిన ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతిగా మెరుపు దాడులు చేస్తామని బారత వాయుసేన కోరితే అప్పటి యూపీఏ ప్రభుత్వం అంగీకరించలేదంటూ.. మోదీ చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ తప్పుబట్టారు. ఈ ప్రపంచంలో మోదీని మించిన అబద్ధాల కోరు మరొకరు ఉండరన్నారు. ఇక, భారత వాయుసేన అధికారి అభినందన్‌ను తిరిగి అప్పగించినందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దిగ్విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి బాటలు వేశారని అభినందించారు.
    First published:

    అగ్ర కథనాలు