• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS SENIOR LEADER DIGVIJAY SINGH BJP EX CM SHIVARAJ SINGH CHOUHAN CONTEST FROM BHOPAL MK

Election 2019: ఇద్దరూ ఒకప్పటి ముఖ్యమంత్రులే...ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ !

Election 2019: ఇద్దరూ ఒకప్పటి ముఖ్యమంత్రులే...ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ !

దిగ్విజయ్ సింగ్ (File)

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కాంగ్రెస్ దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్ మధ్య భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం వేదికగా పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Share this:
    సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌన్, అలాగే కాంగ్రెస్ దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్ మధ్య భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం వేదికగా పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 సంవత్సరాల అప్రతిహతంగా ప్రభుత్వాన్ని నిలుపుకున్న బీజేపీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పింది. అయినప్పటికీ బీజేపీ పూర్తిగా బలహీనపడలేదని ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

    madhya pradesh assembly elections 2018|madhya pradesh cm shivaraj singh chowhan comments on exit polls results|మధ్యప్రదేశ్‌లో మళ్లీ మాదే అధికారం: శివరాజ్‌సింగ్ చౌహన్
    shivraj singh file


    ఇదిలా ఉంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 29 సీట్లలో 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ సైతం 9 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ పేరు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, ఆయనకే ఈ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా దిగ్విజయ్ ను ఓడించేందుకు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బరిలోకి దిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు దిగ్విజయ్ సింగ్ సైతం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం విశేషం.

    అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం విదిశా స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ మాత్రం దిగ్విజయ్ మీద సాధ్వి ప్రగ్యా ఠాకూర్ ను బరిలో నిలపాలని సూచిస్తోంది. 2009 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యా నిర్దోషిత్వం ఖరారు కావడంతో దిగ్విజయ్ పై పోరుకు సరైన ఎంపిక అవుతుందని సంఘ్ పరివార్ వర్గాలు ఆశిస్తున్నాయి.
    First published:

    అగ్ర కథనాలు