హజూర్‌నగర్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్.. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగానూ గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్లో ఉపఎన్నిక వచ్చింది.

news18-telugu
Updated: September 24, 2019, 3:59 PM IST
హజూర్‌నగర్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక కాకా రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన అధికారపార్టీ టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం హుజూర్ నగర్ అభ్యర్థిని ప్రకటించింది. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తమ్ భార్య పద్మావతి 2018 డిసెంబరు ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికకు అక్టోబరు 21న పోలింగ్ జరుగుతుంది. 24న ఫలితాలు వెల్లడిస్తారు.


2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్.. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగానూ గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్లో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో అందరి కంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పటికే ఆయన బీ-ఫామ్ అందుకున్నారు. ఇక బీజేపీ సైతం శ్రీకళా రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

ఈ ఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కేటీఆర్ పలు సభలో పాల్గొని సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నామని చెప్పుకుంటున్న బీజేపీ..లోక్‌సభ ఎన్నికల తరహాలోనే టీఆర్ఎస్-కాంగ్రెస్‌లకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారవడంతో హుజూర్‌నగర్‌లో ఇక నుంచి ప్రచార పర్వం ఊపందుకోనుంది.
కాంగ్రెస్ పత్రికా ప్రకటన


First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading