news18-telugu
Updated: November 20, 2018, 12:11 PM IST
నమూనా చిత్రం
ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఓటింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది.అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈవీఎంలను దుర్వినియోగం చేస్తుందని పీఎల్ పునియా నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో ఎన్నికల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
బీజపీ పార్టీ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఈవీఎంలపై ఫిర్యాదులు రావడంతో రాయ్‌పూర్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిలిచింది. ఈవీఎంల పనితీరుపై పలు పోలింగ్ కేంద్రాల్లో అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ధమ్తారి,జష్పుర, రాయ్‌పూర్ ప్రాంతాల్లో ఈవీఎం ట్యాపంరింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పొద్దున్నుంచి ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇప్పటివరకు పోలింగ్ జరగలేదు. సిహవ నియోజకవర్గంలో ధమ్తరి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు.
రాయ్‌పూర్ మొవాలో 30 ఓట్లు నమోదవ్వగానే ఈవీఎం మొరాయించింది. మరోవైపు రాయ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడతో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈసీ అధికారులు ఎవరూ ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. మొరాయించిన స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను పూర్తిచేస్తామని చెబుతున్నారు.
మరోవైపు ఓటింగ్ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలసీులు సామ్రి బీజేపీ అభ్యర్తి సిద్దనాథ్ పైక్ర ప్రయాణిస్తున్న వాహనం నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 20, 2018, 11:58 AM IST