• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONGRESS PUTS AP SPECIAL STATUS PROMISE IN ITS LOK SABHA ELECTIONS 2019 MANIFESTO AK

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం... మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్... ఆ రాష్ట్రాలకు కూడా...

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం... మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్... ఆ రాష్ట్రాలకు కూడా...

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

Congress election manifesto 2019 | 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఏపీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఏపీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ... ఆ తరువాత అందుకు నో చెప్పింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేక వేదికలపై ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చడంతో... ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలతలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    congress manifesto,congress manifesto 2019,congress election manifesto highlights,election manifesto,congress,lok sabha election 2019,congress manifesto for 2019 elections,manifesto,election 2019,lok sabha elections 2019,rahul gandhi election manifesto,2019 lok sabha election,congress election manifest,congress releases election manifesto,elections 2019,congress loksabha elections manifesto, lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha elections,2019 lok sabha elections,lok sabha election,lok sabha,india lok sabha election 2019,lok sabha polls,mandya lok sabha elections,lok sabha elections survey,india lok sabha election date,lok sabha elections 2019 opinion poll,lok sabha elections 2019 live updates,election 2019,loksabha election 2019,election counting updates,లోక్ సభ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,జనరల్ ఎన్నికలు,ప్రధానమంత్రి,కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో,
    మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాపై వివరణ


    ఏపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేయడంతో... జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు టీడీపీ అంగీకరించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ... జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు