ప్రధాని మోదీపై విరుచుపడిన సోనియా గాంధీ

1984లో రాజీవ్ గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారని అయితే, ఎప్పుడూ విపక్షాన్ని టార్గెట్ చేయలేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని చెప్పారు.

news18-telugu
Updated: August 22, 2019, 10:03 PM IST
ప్రధాని మోదీపై విరుచుపడిన సోనియా గాంధీ
sonia, amitshah, modi (file)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. చిదంబరం అరెస్ట్, సీబీఐకి ఐదు రోజుల కస్టడీ తర్వాత సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1984లో రాజీవ్ గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారని అయితే, ఎప్పుడూ విపక్షాన్ని టార్గెట్ చేయలేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని చెప్పారు. సమయం దొరికిదే దేశం నలుమూలలకూ వెళ్లి ప్రజలతో మాట్లాడేవారని సోనియాగాంధీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ ‘ఆత్మ’ను రాజీవ్ కాపాడారని సోనియా అన్నారు. అయితే, మోదీ ప్రభుత్వం మాత్రం అధికార దురహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ.300 కోట్లకు పైగా డబ్బులు చిదంబరం ఖాతాలో చేరాయంటూ సీబీఐ ఆరోపించింది. పెద్ద ఎత్తున నిధులు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సంస్థల్లోకి వచ్చేలా చిదంబరం పని చేశారని ఆరోపించింది. ఈ క్రమంలో ఈనెల 21న రాత్రి చిదంబరాన్ని సీబీఐ ఆయన నివాసంలో అరెస్ట్ చేసింది. ఈరోజు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. సీబీఐ ప్రత్యేక కోర్టు చిదంబరాన్ని ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>