Hug day: మోదీకి రాహుల్ హగ్.. బీజేపీకి కాంగ్రెస్ వినూత్న సందేశం

2018లో పార్లమెంటులో ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చ సందర్భంగా.. రాహుల్ గాంధీ అనూహ్యంగా ప్రధాని మోదీ దగ్గరికెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.


Updated: February 12, 2020, 4:40 PM IST
Hug day: మోదీకి రాహుల్ హగ్.. బీజేపీకి కాంగ్రెస్ వినూత్న సందేశం
ప్రధాని మోదీకి రాహుల్ హగ్
  • Share this:
వాలెంటైన్స్ వీక్‌లో నేడు హగ్ డే..! ప్రేమ పావురాలన్నీ కౌగిలింత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక హగ్ డే రోజున ప్రధాని మోదీకి కాంగ్రెస్ వినూత్న సందేశం పంపింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు.. బీజేపీకి కౌంటర్ ఇస్తూ హగ్ మెసేజ్ పంపింది. గతంలో పార్లమెంట్‌లో మోదీని రాహుల్ గాంధీ హగ్ చేసుకున్న వీడియోను #HugDay హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో షేర్ చేసింది. 'కౌగిలించుకోండి. విద్వేషించకండి.' అంటూ సందేశాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ విద్వేషాన్ని విశ్వసించదని..ప్రేమనే నమ్ముతుందని వీడియోలో పేర్కొంది.
2018లో పార్లమెంటులో ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చ సందర్భంగా.. రాహుల్ గాంధీ అనూహ్యంగా ప్రధాని మోదీ దగ్గరికెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అనంతరం పలు సందర్భాల్లో ఆ హగ్‌పై వివరణ ఇచ్చారు రాహుల్. ఎవరి పట్లా ద్వేషభావం మంచిది కాదనే తాను భావిస్తానని రాహుల్ చెప్పారు. దాడుల కారణంగానే తాను ఇద్దరు కుటుంబసభ్యులను పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ద్వేషాన్ని ఒక్క ప్రేమమాత్రమే జయించగలదని .. ఆందోళనలు, దాడులు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని తాను భావిస్తానని అప్పట్లో రాహుల్ తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: February 12, 2020, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading