50 రోజుల్లో రూ. 500 కోట్లు... కాంగ్రెస్ కొత్త టార్గెట్

కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో పరాజయాల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో నుంచి గట్టెక్కేందుకు ప్రజల నుంచే నిధులు సేకరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. 50 రోజుల్లో రూ. 500 రోజులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

news18-telugu
Updated: September 19, 2018, 4:46 PM IST
50 రోజుల్లో రూ. 500 కోట్లు... కాంగ్రెస్ కొత్త టార్గెట్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
  • Share this:
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ ఏడాది చివర్లో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కొత్తగా కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న రాహుల్ గాంధీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోరాడేందుకు తమ దగ్గర కావాల్సినన్ని నిధులు లేకపోవడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ... ఈ సమస్య నుంచి గట్టేందుకు ప్రజల నుంచే నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం మిషన్ 500 కోట్లు అనే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మొదలుకాబోయే ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ జయంతి అయిన నవంబర్ 19తో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఆ పార్టీ కోశాధికారిగా బాధ్యతలు తీసుకున్న అహ్మద్ పటేల్ ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్ష‌ల ఎన్నిక‌ల బూత్‌ల నుంచి ఈ నిధులను సేక‌రించాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌మ శ్రేణుల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. ఒక్కో బూత్ నుంచి 5 వేల రూపాయ‌లు సేక‌రించాల‌ని భావిస్తోంది. ఈ లెక్క‌న తాము అనుకున్న 500 కోట్ల రూపాయ‌ల నిధుల సేక‌ర‌ణ పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ఆ పార్టీ భావిస్తోంది. సామాన్యుల నుంచి నిధుల‌ను సేక‌రించే క్ర‌మంలో పార్టీ శ్రేణులు ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం కూడా ఉంటుంద‌న్న‌ది కాంగ్రెస్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

First published: September 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు