సోనియా ధూతగా కేసీఆర్, జగన్‌ల వద్దకు ఆ సీఎం..

ఈ నేపథ్యంలో మే 23న బీజేపీయేతర, తటస్థ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలను కూడా రప్పించాలని భావిస్తోంది.

news18-telugu
Updated: May 17, 2019, 1:14 PM IST
సోనియా ధూతగా కేసీఆర్, జగన్‌ల వద్దకు ఆ సీఎం..
కేసీఆర్, జగన్(File)
news18-telugu
Updated: May 17, 2019, 1:14 PM IST
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకోవడంతో.. ఇక ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. కాంగ్రెస్-బీజేపీల్లో ఎవరికి మెజారిటీ వస్తుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తామంటే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఇరు పార్టీలు ధీమాగా చెబుతున్నా.. ముందు జాగ్రత్తలో భాగంగా ఇతర పార్టీలతోనూ ఇప్పటినుంచే సంప్రదింపులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో మే 23న బీజేపీయేతర, తటస్థ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలను కూడా రప్పించాలని భావిస్తోంది. వీరిద్దరిని భేటీకి తీసుకొచ్చే బాధ్యతలను మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌కు అప్పగించింది.

కేసీఆర్,జగన్‌లతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ కమల్‌నాథ్ చర్చలు జరపనున్నారు. కమల్‌నాథ్ పాటు ఇద్దరు ఏఐసీసీ నేతలు కూడా వీరితో భేటీలో పాల్గొంటారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌కు మెజారిటీ తక్కువై ప్రధాని పదవి దక్కకపోయినా సరే.. బీజేపీని మాత్రం అధికారానికి దూరం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఏఐసీసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. అందుకే ప్రాంతీయ పార్టీలను కూడగట్టి.. కాంగ్రెస్ వాటికి మద్దతునిచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.


ఇదే విషయంపై ఇంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్‌ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. రాహుల్ ప్రధాని కావాలన్నదే తమ అంతిమ లక్ష్యం అని.. రాష్ట్రంలో అధికారం కంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే తమకు ముఖ్యమన్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో ఆరో రోజుల గడువు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఎవరు ఎవరి వైపు వెళ్తారో అన్నది తేలాంటే.. మే 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...