హుజూర్ నగర్ ఉపఎన్నిక : అప్పుడే ఎంత మెజారిటీతో గెలుస్తామో చెప్పేసిన ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తమ్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని బరిలో దింపడం దాదాపుగా ఖరారైంది. అటు టీఆర్ఎస్ మరోసారి శానంపూడి సైదిరెడ్డికే ఛాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమిపాలయ్యారు.

news18-telugu
Updated: September 21, 2019, 4:55 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నిక : అప్పుడే ఎంత మెజారిటీతో గెలుస్తామో చెప్పేసిన ఉత్తమ్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30వేల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేత్రుత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.అధికార అహంకారానికి,ప్రజాస్వామ్యానికి మధ్య ఈ ఉపఎన్నిక జరగబోతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే హుజూర్ నగర్ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఎన్నో హామీలను విస్మరించిందని.. నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఇవ్వడం లేదని గుర్తుచేశారు.అక్టోబర్ 21న హుజూర్ నగర్‌కు ఉపఎన్నిక ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించి నేపథ్యంలో ఉత్తమ్ మాట్లాడారు.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23న హుజూర్ నగర్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 21న జరిగే ఉపఎన్నిక కోసం సెప్టెంబర్ 30తో నామినేషన్ల గడువు ముగియనుంది. అక్టోబర్ 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి 24న ఫలితాలు వెల్లడిస్తారు. ఇదిలా ఉంటే,కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తమ్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని బరిలో దింపడం దాదాపుగా ఖరారైంది. అటు టీఆర్ఎస్ మరోసారి శానంపూడి సైదిరెడ్డికే ఛాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమిపాలయ్యారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>