ఆ రెండుపార్టీలు పెద్ద తప్పు చేశాయ్.. ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి కొత్త కూటమి పెట్టుకోవడంతో ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైపోయింది.

news18-telugu
Updated: January 12, 2019, 2:56 PM IST
ఆ రెండుపార్టీలు పెద్ద తప్పు చేశాయ్.. ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్
congress less ghatbandhan
  • Share this:
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీకి చెక్ పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి.. ఎన్నికల ముంగిట పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోండా.. ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మాయావతి, అశిలేష్ యాదవ్ ప్రెస్‌మీట్ పెట్టిమరీ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 4 స్థానాలను మాత్రం ఇతర పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అందులో, రెండు స్థానాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, ఆయన తల్లి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ ఉన్నాయి. ఆ రెండింటిని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి విడిచి పెట్టాలని నిర్ణయించినట్టు మాయావతి స్పష్టం చేశారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని ప్రకటించారు.

sp bsp alliance, sp bsp alliance in up, akhilesh yadad, mayawati, samajwadi party, bsp, ఎస్పీ బీఎస్పీ, యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు, అఖిలేష్ యాదవ్, మాయావతి
జాయింట్ ప్రెస్ మీట్‌లోమాయావతి, అఖిలేష్ యాదవ్


ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న అనూహ్యం నిర్ణయంతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి.. ఆ రెండు పార్టీలు పెద్ద తప్పు చేశాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోకుండా పొత్తును ఖరారు చేయడం.. ఎస్పీ, బీఎస్పీలు చేసిన ప్రమాదకరమైన తప్పిదమని వ్యాఖ్యానించారు. ’’ కాంగ్రెస్ కష్టకాలాన్ని ఎదుర్కోవచ్చు. కానీ, కాంగ్రెస్‌ను విస్మరించడం ఆ రెండు పార్టీలు చేసిన ప్రమాదకరమైన తప్పిదం‘‘ అని సింఘ్వి అభిప్రాయపడ్డారు.

sp bsp alliance, samajwad party, bahujan samaj party, mayawati, akhilesh yadav, ఎస్పీ బీఎస్పీ పొత్తు, మాయావతి, అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ
అఖిలేశ్, మాయావతి(File)


ఆర్ఎల్‌డీ, నిషద్ వంటి పార్టీలు సైతం ఎస్పీ, బీఎస్పీల కూటమిలో చేరనుండడంతో.. ఇక, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. మరి, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Published by: Santhosh Kumar Pyata
First published: January 12, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading