సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. ఆయన ప్రధాని మంత్రి కావడానికి దారితీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ మూవీ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు విడుదలకు ముందే ఈ మూవీపై వివాదాలు ముసురు కుంటున్నాయి. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు.
తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ కల్చర్ హెరిటేజ్ బోర్డ్ చైర్మన్ చరణ్ జీత్ సప్రా ఈ మూవీ దర్శక, నిర్మాతలపై విరుచుకుపడ్డారు. ఈ మూవీలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంతో పాటు సిక్ సంప్రదాయాలను కించపరిచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా విడుదల చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా డైరెక్టర్ విజయ్ రత్నాకర్ గుట్టే ‘ది ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ చిత్రాన్ని తెరకెక్కించారని ఆరోపించారు. సదరు డైరెక్టర్ గతంలో కొన్ని వివాదాలతో అరెస్టైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
సదరు నిర్మాతల్లో ఒకరైన సునీల్ బొహ్రాపై కోర్టులో పలు వివాదాలున్నాయని ఆరోపించారు. ఈ సినిమాను కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వాళ్లే ఈ మూవీకి ఫండింగ్ చేసినట్టు చెప్పకనే బీజేపీపై విరుచుకుపడ్డారు. మొత్తానికీ ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bollywood, Manmohan singh, Rahul Gandhi, Sonia Gandhi