ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందా? హస్తం కథ మళ్లీ మొదటికొస్తుందా?

రాహుల్, చంద్రబాబు, జగన్, పవన్ ఫైల్

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జీరో అయిపోయింది హస్తం పార్టీ. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కోలుకుంటున్నట్టుగా అనిపిస్తున్న తరుణంలో.. కొత్త తలనొప్పి వచ్చిపడింది.

 • Share this:
  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ.. సీమాంధ్రుల కోపానికి గురయ్యింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీని ఏపీ ప్రజలు ఘోరంగా ఓడించారు. కోలుకోలేనంత దెబ్బకొట్టారు. అయితే, రాష్ట్రంలో, దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. హస్తం పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనుకడుగు వేయడం, అధికారంలో రాగానే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనే అని కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రకటించడం వంటి అంశాలు.. ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మలుపు తిప్పాయి. అధికార టీడీపీ, ఢిల్లీస్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో హస్తం పార్టీకి కాస్త మైలేజ్ వచ్చినట్టే ఉంది. అయితే ఈ మైలేజీ రాష్ట్ర స్థాయిలో ఉపయోగపడకపోయినా.. ఎంపీ స్థానాలకు ఉపయోగపడొచ్చనే భావనలో ఆ పార్టీ ఉంది.

  ap congress, ap bifurcation, ap special status, janasena pawan kalyan, tdp, ysrcp, ys jagan, ap cm chandrababu naidu, bjp, pm narendra modi, congress chief rahul Gandhi, ఏపీ కాంగ్రెస్, ఏపీ విభజన, ఏపీ స్పెసల్ స్టేటస్, జనసేన పవన్ కల్యాణ్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ
  చంద్రబాబు, రాహుల్ , జగన్ (ఫైల్)

  అయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీలో క్యాడరంతా ఇతర పార్టీలకు వెళ్లిపోయింది. నాయకులు మాత్రమే మిగిలిపోయారు. 2014 ఎన్నికల ముందు కొందరు, ఆ తర్వాత మరికొందరు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిమంది నేతలు కూడా వలసబాట పడుతున్నారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

  ap congress, ap bifurcation, ap special status, janasena pawan kalyan, tdp, ysrcp, ys jagan, ap cm chandrababu naidu, bjp, pm narendra modi, congress chief rahul Gandhi, ఏపీ కాంగ్రెస్, ఏపీ విభజన, ఏపీ స్పెసల్ స్టేటస్, జనసేన పవన్ కల్యాణ్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ
  రాహుల్, పవన్ ఫైల్

  ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌నేతలు, మాజీ మంత్రుల్లో చాలామంది.. జనసేన గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

  ap congress, ap bifurcation, ap special status, janasena pawan kalyan, tdp, ysrcp, ys jagan, ap cm chandrababu naidu, bjp, pm narendra modi, congress chief rahul Gandhi, ఏపీ కాంగ్రెస్, ఏపీ విభజన, ఏపీ స్పెసల్ స్టేటస్, జనసేన పవన్ కల్యాణ్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ
  పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్  file

  ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి రావెల కిశోర్.. కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లోని కీలక నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చర్చలు సఫలమైతే.. భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు పవన్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, కుదుటపడుతోందనుకున్న కాంగ్రెస్.. ఖాళీ కాబోతోందనే టాక్ రాజకీయవర్గాల్లో షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయనేది చూడాలి.
  First published: