కాంగ్రెస్ నుంచి చీలిపోయి కొత్తగా పుట్టిన పార్టీలెన్నో తెలుసా?.. ప్రణబ్ కూడా..

కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ కూడా ఆ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీ పెట్టారు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన, రాజీవ్‌ గాంధీ హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు.

news18-telugu
Updated: May 15, 2019, 11:44 AM IST
కాంగ్రెస్ నుంచి చీలిపోయి కొత్తగా పుట్టిన పార్టీలెన్నో తెలుసా?.. ప్రణబ్ కూడా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రస్తుతం వరకు ప్రతి రాజకీయ పరిణామంలో ఆ పార్టీ మార్క్ ఉండాల్సిందే. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్.. ఇలా ఎంతోమంది ఈ పార్టీ తరఫున సేవ చేశారు. ఇంతటి ఘనత ఉన్న ఈ పార్టీ.. ఎన్నో పార్టీలు పురుడు పోసుకోవడానికి కారణమైంది. దేశ, రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నుంచి చీలిపోయి కొత్తగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఆ పార్టీ నుంచి చీలిపోయి మొత్తం ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చాయో తెలుసా.. 70కి పైగానే. ఆ పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైఎస్సార్‌సీపీ, పీడీపీ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

మొత్తం 70 పార్టీల్లో ఎక్కువ భాగం ఉనికిలో లేకుండా పోవడమో.. లేదంటే ఇతర పార్టీల్లో కలిసి పోవడమో జరిగింది. ఇంకొన్ని పార్టీలు మనుగడ సాగిస్తున్నా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు పాత్రను పోషిస్తున్నాయి. విశేషమేమిటంటే.. కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ కూడా ఆ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీ పెట్టారు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన, రాజీవ్‌ గాంధీ హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్‌గాంధీని సూచించడం సరికాదని భావించారు. ప్రధాని పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. అయితే, 1989లో రాజీవ్‌గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>