ఇంటికో ఉద్యోగమేదీ..? కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

స్యయంప్రతిపత్తి హోదా కలిగిన వేదికగా తెలంగాణ యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

news18-telugu
Updated: September 19, 2019, 7:50 PM IST
ఇంటికో ఉద్యోగమేదీ..? కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి  బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 19, 2019, 7:50 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారో చూపించాలంటూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో యువత నిర్లక్ష్యానికి గురవుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

యువతలోని నైపుణ్యాలను మెరుగుపరిస్తే దేన్నైనా సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాష్ట్ర యువజన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మల్కాజ్‌గిరి ఎంపీ. స్యయంప్రతిపత్తి హోదా కలిగిన వేదికగా తెలంగాణ యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర యువతను కేసీఆర్ పట్టించుకోవాలని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...