ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని మాటిచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ఆయన ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: October 6, 2019, 3:06 PM IST
ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 6, 2019, 3:06 PM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దసరాకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తోంది. ప్రైవేట్ డ్రైవర్లతో పోలీసుల రక్షణ మధ్య బస్సులను నడుపుతోంది. ఐతే ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పట్టించుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు లేఖరాశారు రేవంత్ రెడ్డి.

ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమను టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో పొగిడారని రేవంత్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని మాటిచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శలు గుప్పించారు. ఆయన ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతేమో గానీ.. ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...