డీజీపీ రాజీనామా చేయాలి.. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : రేవంత్

పౌర సమాజానికి సేవలందించాల్సిన పోలీసులను రాజకీయ నాయకులకు ఉపయోగిస్తూ ప్రజా భద్రతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: December 1, 2019, 4:18 PM IST
డీజీపీ రాజీనామా చేయాలి.. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : రేవంత్
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
పోలీసుల నిఘా వైఫల్యం, ప్రభుత్వం అసమర్థత వల్లే షాద్ నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జరిగిన ఘటనపై యావత్ దేశం స్పందిస్తున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇంతకంటే మరో దుర్మార్గం లేదన్నారు. పౌర సమాజానికి సేవలందించాల్సిన పోలీసులను రాజకీయ నాయకులకు ఉపయోగిస్తూ ప్రజా భద్రతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిఘా విషయంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని ఆరోపించారు. సీఎం కేసీఆర్,డీజీపీ ఇప్పటికైనా ఘటనపై స్పందించాలని కోరారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఇప్పటికీ సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదని తప్పు పట్టారు. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

గతంలో జరిగిన సంఘటనలపై సరైన చర్యలు తీసుకోనందువల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే వెన్నులో వణుకుపుట్టేలా చేయాలన్నారు. సోమవారం పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు.First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>