Home /News /politics /

CONGRESS MP REVANTH REDDY TAKES OATH AS MEMBER OF LOK SABHA SPEAKS SEEING MOBILE PHONE AK

ఎంపీగా రేవంత్ రెడ్డి ప్రమాణం... సెల్‌ఫోన్‌లో చూస్తూ సరికొత్తగా...

 రేవంత్ రెడ్డి (File)

రేవంత్ రెడ్డి (File)

తాను చెప్పదలుచుకున్నది సెల్‌ఫోన్‌లో ముందుగానే ఫీడ్ చేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి... సెల్ ఫోన్ చూసుకుంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి... దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

    తొలిసారి ఎంపీగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి... లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం సభలో ప్రమాణం చేసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి... అధికారులు ఇచ్చే పత్రాన్ని తీసుకోకుండా సెల్‌ఫోన్ చూస్తూ ప్రమాణం చేశారు. తాను చెప్పదలుచుకున్నది సెల్‌ఫోన్‌లో ముందుగానే ఫీడ్ చేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి... సెల్ ఫోన్ చూసుకుంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి... దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బల్లలు చరిచి అభినందనలు తెలిపారు.

    మల్కాజ్ గిరి బరిలో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి... తన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి హోరాహోరీ పోరు విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు. కొన్ని నెలల ముందు కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి... ఆరు నెలల తిరగకముందే ఎంపీగా విజయం సాధించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Lok sabha, Malkajgiri S29p07, Revanth reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు