కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు... లక్ష కోట్ల ఆస్తులు...

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గతంలో అనేక హామీలు ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: October 14, 2019, 4:14 PM IST
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు... లక్ష కోట్ల ఆస్తులు...
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 14, 2019, 4:14 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తానన్న సీఎం కేసీఆర్... మాట తప్పారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ మొత్తం రూ.2500 కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ధ్వజమెత్తారు. రెండు రోజులు డ్యూటీకీ రాకపోతేనే ఆర్టీసీ ఉద్యోగుల జాబ్ పోయిందని కేసీఆర్ అనడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. కొన్నేళ్ల నుంచి సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. 50వేల మంది కార్మికులు దసరాకు పస్తులున్నారని... కానీ కేసీఆర్ మాత్రం సంబరాలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి ఖర్చులను కూడా ప్రభుత్వం భరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతం రాక ఆర్టీసీ కార్మికుడు సురేందర్ గౌడ్ హౌసింగ్‌లోన్ చెక్ బౌన్స్ అయ్యిందని... అందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డానని రేవంత్ రెడ్డి అన్నారు.


First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...