సైదిరెడ్డి విజయానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదు.. హుజూర్ నగర్ ఫలితంపై రేవంత్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి విలువ లేదన్న టీఆర్ఎస్ నేతలు.. ఉపఎన్నికల్లో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమేంటోనని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి.

news18-telugu
Updated: October 26, 2019, 5:21 PM IST
సైదిరెడ్డి విజయానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదు.. హుజూర్ నగర్ ఫలితంపై రేవంత్ రెడ్డి
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రాజకీయంగా కొత్త సవాల్ విసిరారనే చెప్పాలి. మరి.. తనదైన వ్యహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే కేసీఆర్.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తుగడను ఏ రకంగా తిప్పుకొడతారన్నది ఆసక్తికరంగా మారింది.
  • Share this:
హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ విజయంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రచారం లేకుండానే సైదిరెడ్డి గెలిచారని... ఆయన విజయానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. హుజూర్ నగర్ ప్రజలపై ఒత్తిడి ఉందా అనేది తెలియాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో కొడంగల్ పైనా హామీల వర్షం కురిపించారన్న ఆయన.. గెలిచిన తర్వాత కొడంగల్‌కు ఎన్ని అభివృద్ధి నిధులు కేటాయించారో అందరికీ తెలుసని విమర్శించారు. రేపు హుజూర్ నగర్ పరిస్థితి కూడా అంతేనని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి విలువ లేదన్న టీఆర్ఎస్ నేతలు.. ఉపఎన్నికల్లో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమేంటోనని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి.

కాగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం హజూర్ నగర్‌లో పద్మావతి పరాజయం పాలయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గలో ఆయన భార్య ఓడిపోయారు. పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి 43,358 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. సైదిరెడ్డికి 113097 ఓట్లు పోలవగా..ఉత్తమ్ పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే పడాయి. ఇక బీజేపీ అభ్యర్థి కోట రామారావు 2639, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి 1827 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐతే బీజేపీ, టీడీపీ అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి సంపత్ (2697)కు ఎక్కువ ఓట్లు పడడం విశేషం.
Published by: Shiva Kumar Addula
First published: October 26, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading