Home /News /politics /

CONGRESS MP RAHUL GANDHI HAS CRITICIZED PRIME MINISTER NARENDRA MODI FOR NOT RESPONDING TO THE ISSUES PRV

Lakhimpur: ప్రధాని మోదీజీ ఇకనైనా మౌనం వీడండి.. లఖీంపూర్​ ఘటన, ధరల పెరుగుదలపై రాహుల్​ గాంధీ విమర్శలు

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

కేంద్ర మంత్రి కుమారుడు అశిష్​ మిశ్రా (Ashis Mishra)ను ఈనెల 10న కస్టడీలోకి తీసుకుంది యూపీ పోలీస్ డిపార్ట్​మెంట్​. అరెస్టుచేసి రిమాండ్​కు తరలించారు. ఇక ఇప్పటికీ దీనిపై ప్రధాని మోదీ స్పందించకపోవడంతో కాంగ్రెస్​ పార్టీ మాజీ చీఫ్​, ఎంపీ రాహుల్​ గాంధీ (MP Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లోని లఖీంపూర్ (Lakhimpur) ​లో రైతులపై కేంద్రమంత్రి కుమారుడి కారు దూసుకెళ్లిన దగ్గరినుంచి బీజేపీ (BJP)పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ (Opposition party)ల సభ్యులు కాషాయ పార్టీ తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్​ మాత్రం ఎన్నడూ లేనంతగా దూకుడు పెంచింది. లఖీంపూర్​ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ (PM Modi), ఉత్తర ప్రదేశ్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇరుకున పెట్టే పరిస్థితికి తెచ్చింది.

మరోవైపు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో సుప్రీం సైతం యూపీ పోలీసుల (UP Police)పై మండిపడింది. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్ర మంత్రి కుమారుడు అశిష్​ మిశ్రా (Ashis Mishra)ను ఈనెల 10న కస్టడీలోకి తీసుకుంది యూపీ పోలీస్ డిపార్ట్​మెంట్​. అరెస్టుచేసి రిమాండ్​కు తరలించారు. ఇక ఇప్పటికీ దీనిపై ప్రధాని మోదీ స్పందించకపోవడంతో కాంగ్రెస్​ పార్టీ మాజీ చీఫ్​, ఎంపీ రాహుల్​ గాంధీ (MP Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. ప్రధాని (Prime minister) మౌనం వీడాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ట్విటర్ (twitter)​లో ప్రకటన చేశారు.

రైతుల హత్యలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధర పెంపు, దేశంలో నిరుద్యోగం (Un employment)పై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. లఖింపూర్‌ ఖేరిలో రైతులను (farmers) కాన్వాయ్‌తో తొక్కి చంపిన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుతున్నాయని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్ ప్రధాని మోదీని నిలదీసే ప్రయత్నం చేశారు.



ప్రియాంక సైతం..

ఇక, ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో నిర్వహించిన కాంగ్రెస్‌ (congress) సభలో ప్రసంగించారు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi). అధిక ధరలతో దేశ ప్రజలు అల్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రధాని మోదీ లఖీంపూర్‌ ఖేరి బాధితులను ఎందుకు పరామర్శించలేదని  ప్రియాంక ప్రశ్నించారు. లక్నోకు వచ్చిన మోదీ లఖీంపూర్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రియాంకాగాంధీ విమర్శించారు.

సంయుక్త కిసాన్ మోర్చా..

రైతు సంఘాల గొడుగు సంస్థ అయిన సంయుక్త కిసాన్ మోర్చా (kisan morcha) సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మూడు వాహనాలతో హెలిప్యాడ్ వద్ద తమ నిరసన నుండి రైతులు చెదిరిపోతున్న సమయంలో వచ్చారని రైతు నేతలు అంటున్నారు. రైతులతోపాటు, SKM నాయకుడు తజిందర్ సింగ్ విర్క్ మీద నేరుగా వాహనం నడపడానికి ప్రయత్నించారని మోర్చా నేతలు ఆరోపణలు చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Congress, Farmers, Narendra modi, Priyanka Gandhi, Rahul Gandhi, Uttar pradesh

తదుపరి వార్తలు