కేసీఆర్, కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.

news18-telugu
Updated: January 27, 2020, 12:12 PM IST
కేసీఆర్, కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
కేసీీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ,కేటీఆర్ పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను కాల్చి చంపినా తప్పులేదని ఆయన విమర్శించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌కు ప్రజలు మెజార్టీ ఇచ్చారని... అయినా దొడ్డిదారిన టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. వరంగల్‌కు చెందిన కడియం శ్రీహరితో ఎక్సఆఫిషియో ద్వారా ఓటు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే అక్రమ భూ దందా చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు | Congress mp Komatireddy venkat reddy slams kcr and ktr ak
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)


తుర్కపల్లిలో కేసీఆర్ కూతురు కవిత అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని... ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఇక్కడి పేద ప్రజలకు ఏమి చేయలేదని ఆయన అన్నారు. నల్లగొండలో మున్సిపాలిటీని బీజేపీ, ఎంఐఎంతో కలిసి మునిసిపల్ ఛైర్మెన్ గెలుచుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. యాదగిరిగుట్ట సీఐ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు