Home /News /politics /

CONGRESS MP AND YS RAJASHEKAR REDDY FRIEND KVP RAMACHANDRA RAO MAY JOIN YSRCP AND OFFER HIS POLITICAL SERVICES TO AP NEW CM YS JAGAN MOHAN REDDY AK

జగన్‌తో మళ్లీ కేవీపీ జట్టుకడతారా... వైఎస్ఆర్ ఆప్తుడి పయనమెటు ?

జగన్, కేవీపీ

జగన్, కేవీపీ

వైఎస్ మరణానంతరం కూడా జగన్‌తో కొంతకాలం సన్నిహితంగానే ఉంటూ వచ్చిన కేవీపీ... జగన్‌ కాంగ్రెస్‌తో పూర్తిగా విభేదించాలని నిర్ణయించుకున్న తరువాత ఆయనకు దూరమవుతూ వచ్చారు.

    ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే... కచ్చితంగా ఆయన ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రస్తావన ఉండాల్సిందే. అంతలా వైఎస్ఆర్‌తో కేవీపీ స్నేహబంధం కొనసాగింది. వైఎస్ మరణానంతరం కూడా జగన్‌తో కొంతకాలం సన్నిహితంగానే ఉంటూ వచ్చిన కేవీపీ... జగన్‌ కాంగ్రెస్‌తో పూర్తిగా విభేదించాలని నిర్ణయించుకున్న తరువాత ఆయనకు దూరమవుతూ వచ్చారు. రాజకీయంగా జగన్‌కు దూరమైనా... వైఎస్ కుటుంబంతో కేవీపీ అనుబంధం మాత్రం కొనసాగుతూ వచ్చింది.

    మరోవైపు జగన్‌కు రాజకీయంగా దూరంగా ఉంటూ వచ్చిన కేవీపీ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే... జగన్‌ను కేవీపీనే కాంగ్రెస్ వైపు తీసుకెళ్లేవారని ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో...జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న కేవీపీ ఏం చేయబోతున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశం లేకపోవడంతో... ఆయన జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి కుటుంబ స్నేహితుడిగా హాజరైన కేవీపీ... త్వరలోనే వైసీపీలో చేరి జగన్‌కు తన రాజకీయ సేవలు అందిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. మరి... తన తండ్రి వైఎస్ఆర్ ఆత్మబంధువుగా చెప్పుకునే కేవీపీని జగన్ రాజకీయంగా అక్కున చేర్చుకుని ఆదరిస్తారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Cm jagan, Kvp ramachandra rao, Ys jagan mohan reddy, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు