మళ్లీ 'రిసార్ట్' రాజకీయం.. కర్ణాటక కాంగ్రెస్‌లో కలవరం..

సిద్దరామయ్య, కుమారస్వామి(File)

బీజేపీకి చిక్కకుండా ఉండాలంటే పార్టీ కనుసన్నుల్లో ఎమ్మెల్యేలందరిని రిసార్టులకు తరలించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా బెంగళూరు శివారులోని ఈగల్‌టన్, వండర్‌లా రిసార్టులకు వారిని తరలించారు.

 • Share this:
  కర్ణాటక రాజకీయాలు మళ్లీ రిసార్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి రిసార్టులను ఆశ్రయించక తప్పలేదు. శుక్రవారం నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి విప్ జారీ చేసినప్పటికీ.. నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం పార్టీలో కలవరం రేపింది. మాజీ మంత్రులు సతీశ్‌ జర్కిహోళి, ఉమేశ్‌ జాదవ్‌, ఎమ్మెల్యేలు మహేశ్‌ కుమటహళ్లి, నాగేంద్ర సమావేశానికి హాజరుకాలేదు.

  ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబై హోటల్లోనే ఉండిపోగా.. మరో రెబల్ ఎమ్మెల్యే ఉమేశ్ యాదవ్ మాత్రం తన గైర్హాజరుపై పార్టీకి సమాచారం అందించారు. కోర్టు కేసు కారణంగా సమావేశం నుంచి తనకు మినహాయింపునివ్వాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ బలం 120 నుంచి 118కి పడిపోయింది. ఇప్పుడు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తప్పుకుంటే ఆ సంఖ్య 114కి పరిమితం అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ 113కి కేవలం ఒక్క సీటు మాత్రమే ఎక్కువ.

  ఈ నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ గద్దలా తన్నుకుపోతుందోనన్న టెన్షన్ కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. బీజేపీకి చిక్కకుండా ఉండాలంటే పార్టీ కనుసన్నుల్లో ఎమ్మెల్యేలందరిని రిసార్టులకు తరలించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా బెంగళూరు శివారులోని ఈగల్‌టన్, వండర్‌లా రిసార్టులకు వారిని తరలించారు.

  లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ పడుతుందోనన్న భయంతో బీజేపీ మా ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి పనిచేస్తే కర్ణాటకలో బీజేపీకి 3-4కి మించి లోక్‌సభ సీట్లు రావు. బీజేపీ మా ఎమ్మెల్యేలకు దాదాపు రూ.100కోట్లు ఆఫర్ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల్లాగా మావాళ్లను మేము గురుగ్రామ్ తరలించట్లేదు. మా ఎమ్మెల్యేలను మేము కాపాడుకుంటాం.
  మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య


  ఇది కూడా చదవండి : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా?.. తెర వెనుక 'ఆపరేషన్ కమల్'
  First published: