‘ఆర్టీసీసై కేసీఆర్‌కు ఇంటలిజెన్స్ రిపోర్ట్’

ఆర్టీసీ కార్మికులను సమ్మెకు వెళ్ళేవిధంగా పురిగొలిపి...ఆర్టీసీ చార్జీలు పెంచడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేశారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: November 29, 2019, 2:40 PM IST
‘ఆర్టీసీసై కేసీఆర్‌కు ఇంటలిజెన్స్ రిపోర్ట్’
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్‌కు ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ కారణంగానే ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ విషయంలో తాను అనుకున్నట్టుగానే ముందుగా సాగితే మునిసిపల్ ఎన్నికలను ఎదురుకోవడం కష్టమని కేసీఆర్ భావించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను సమ్మెకు వెళ్ళేవిధంగా పురిగొలిపి...ఆర్టీసీ చార్జీలు పెంచడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.

Cm kcr, tsrtc, jeevan reddy, telangana, సీఎం కేసీఆర్, ఆర్టీసీ సమ్మె, జీవన్ రెడ్డి, తెలంగాణ
జీవన్ రెడ్డి (File)


ఆర్టీసీ సమ్మెకు నోటీసులు ఇచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎందుకు పెద్ద బుద్ది లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటూ..చార్జీలను పెంచుతూ ప్రజల దృష్టిని కేసీఆర్ మళ్లించారని ఆరోపించారు. 6 సంవత్సరాల నుండి ఆర్టీసీ నష్టాలకు సీఎం బాద్యుడు కాదా ? అని జీవన్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో యూనియన్‌లు లేవని చెప్పడానికి కేసీఆర్ ఎవరని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ రాజు అనుకుంటున్నారని..నియంత లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.సీఎం కేసీఆర్ వెంటనే పెంచిన బస్ చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 29, 2019, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading