బడ్జెట్ కాదు... కేసీఆర్ వైఫల్యాల పుస్తకం... కాంగ్రెస్ విమర్శ

తెలంగాణ బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: September 9, 2019, 1:26 PM IST
బడ్జెట్ కాదు... కేసీఆర్ వైఫల్యాల పుస్తకం... కాంగ్రెస్ విమర్శ
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీన్ని బడ్జెట్ అనడం కంటే... కేసీఆర్ వైఫల్యాల పుస్తకం అంటే బాగుంటుందని ఆయన విమర్శించారు. ఆర్థిక మాంద్యం పేరు చెప్పి... తన వైఫల్యాలను సీఎం కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్’లో సగానికి పైగా కేంద్రం ఆర్థిక విధానాలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వృద్ధి పడిపోకుండా ఉండేందుకు తానేమీ చేస్తున్నాననే విషయాన్ని కేసీఆర్ చెప్పలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నా... కేసీఆర్ ఆ పని చేయలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే తన కమీషన్ల లెక్కలు బయటకు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బడ్జెట్ అంచనాలను భారీగా తగ్గించడం సీఎం కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 24 వేల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేశారని దుయ్యబట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకం నిధులను తెచ్చుకుని ఆరోగ్యశ్రీ అమలుకు వినియోగించుకునే అవకాశం ఉన్నా... సీఎం కేసీఆర్ ఆ పని చేయడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు.


First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...