కరోనా వచ్చినా... రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే

కరోనా పాజిటివ్ వచ్చినా ఓటేయడానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ( Image: ANI)

మధ్యప్రదేశ్‌లో కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే పీపీఈ కిట్ వేసుకుని వచ్చి ఓటేశారు.

  • Share this:
    దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల అనారోగ్యంతో ఉన్న ఎమ్మెల్యేలు అంబులెన్స్‌లో వచ్చి ఓటేస్తుంటే.. మధ్యప్రదేశ్‌లో కరోనా సోకిన ఓ ఎమ్మెల్యే పీపీఈ కిట్ వేసుకుని వచ్చి ఓటేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదే కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ సభకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి ఆయా పార్టీలు విప్‌లు కూడా జారీ చేస్తుంటాయి. అందుకే కరోనా పాజిటివ్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సభకు వచ్చారు. క్వారంటైన్‌లో ఉన్న ఆయన పూర్తి పీపీఈ కిట్‌ను ధరించి, ఫుల్ ప్రొటక్షన్‌తో సభలోకి వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.    పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యే రావడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించడంతో పాటు పలువురు ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను పోటీలో నిలిపాయి. దీంతో ఇరు పార్టీలకు ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో కరోనా సోకిన ఎమ్మెల్యే సైతం పీపీఈ కిట్ ధరించి ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు.
    First published: