Kalvakuntla Kavitha: కవితకు సవాల్ విసరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి ప్లాన్

కవిత, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kavitha Versus Seethakka: కొద్దిరోజుల క్రితమే సింగరేణి కార్మికులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందుకు తగ్గట్టుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి(Revanth Reddy)దూకుడు పెంచారు. ఓ వైపు పార్టీ నేతలకు కలుపుకుని ముందుకు సాగుతూనే.. మరోవైపు టీఆర్ఎస్‌కు ఎక్కడెక్కడ చెక్ పెట్టాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సింగరేణిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే సింగరేణి(Singareni) కార్మిక సంఘాలు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రస్తుతం టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం హవా కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితమే సింగరేణి కార్మికులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందుకు తగ్గట్టుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకే టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయాలు తీసుకుందనే ప్రచారం కూడా సాగింది. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ బలం పెంచుకోవాలని భావిస్తోంది.

    ఈ క్రమంలోనే సింగరేణిలో కాంగ్రెస్(Congress) పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏ రకంగా పుంజుకోవాలి ? అందుకు ఏం చేయాలనే అంశాలను పరిశీలించే బాధ్యతను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్క(Seethakka)కు అప్పగించినట్టు తెలుస్తోంది. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షురాలిగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. రాబోయే కార్మిక సంఘాల ఎన్నికల్లో తమ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించే బాధ్యతను కూడా ఆమె తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే కవిత చాలా రోజుల నుంచి వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. కార్మిక సంఘాల్లోనే ముఖ్యనాయకులతో ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది.

    YS Sharmila: వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తెరవెనుక జరిగింది ఇదే..

    ఇక సీతక్క కూడా ఈ ఎన్నికల కోసం రంగంలోకి దిగితే.. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు కవిత వర్సెస్ సీతక్కగా ఉండే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఈ ఇద్దరు మహిళా నాయకులు ఇప్పటికే తమ సత్తా చాటారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈ ఇద్దరు మహిళా నేతలు.. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తమ పార్టీల గెలుపు కోసం ఏ రకంగా పని చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే సీతక్క సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం మెరుగైన ఫలితాలు సాధించేలా చేస్తారా ? ఇందుకోసం పరిస్థితులను బట్టి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: