కాంగ్రెస్ టైటానిక్ లాంటిది... ఎంపీ కోమటిరెడ్డి కూడా బీజేపీలోకే వస్తారన్న రాజగోపాల్ రెడ్డి

కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... మళ్లీ తనకు బీజేపీ నుంచి ఆహ్వానం లేదంటూ రాజకీయవర్గాల్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.

news18-telugu
Updated: July 19, 2019, 5:06 PM IST
కాంగ్రెస్ టైటానిక్ లాంటిది... ఎంపీ కోమటిరెడ్డి కూడా బీజేపీలోకే వస్తారన్న రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 19, 2019, 5:06 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనలాంటి వ్యక్తి చేరితేనే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే తన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో చేరినా... ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ డేట్ బార్ అయిన మెడిసిన్ లాంటిదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. టైటానిక్ ఓడలో నాలాంటి హీరో ఉన్నా మునిగిపోవాల్సిందేనని... పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే ఓడగా అభివర్ణించారు.

కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... మళ్లీ తనకు బీజేపీ నుంచి ఆహ్వానం లేదంటూ రాజకీయవర్గాల్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అయితే తెలంగాణలో భవిష్యత్తు ముమ్మాటికి బీజేపీదే అంటూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను కాంగ్రెస్‌ను వీడబోనని గతంలోనే స్పష్టం చేసిన ఎంపీ కోమటిరెడ్డి... తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాలి.


First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...