హరీశ్ రావుతో కోమటిరెడ్డి భేటీ... కారెక్కుతారా ?

కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే రీసెంట్‌గా ఈ అంశంపై యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి... తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్టు ప్రకటించి పార్టీ మార్పు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

news18-telugu
Updated: September 17, 2019, 1:54 PM IST
హరీశ్ రావుతో కోమటిరెడ్డి భేటీ... కారెక్కుతారా ?
హరీశ్ రావు, రాజగోపాల్ రెడ్డి
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికమంత్రి హరీశ్ రావుతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో ఎమ్మెల్యే కోమటిరెడ్డి సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే రీసెంట్‌గా ఈ అంశంపై యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి... తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్టు ప్రకటించి పార్టీ మార్పు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

అయితే పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి హరీశ్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో చేరే విషయంపై యూటర్న్ తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... తాజాగా టీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఈ కారణంగానే ఆయన ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన హరీశ్ రావుతో సమావేశమయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్న హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను అడిగేందుకే కోమటిరెడ్డి ఆయనను కలిశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంత హఠాత్తుగా మంత్రి హరీశ్ రావును కలవడం రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.


First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>