మధు యాష్కీతో అదీ డీల్... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికలకు ముందు మధు యాష్కీతో తాను ఏం అవగాహన చేసుకున్నాననే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.

news18-telugu
Updated: March 21, 2020, 10:21 PM IST
మధు యాష్కీతో అదీ డీల్... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (File)
  • Share this:
నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధు యాష్కీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు టీ పీసీసీ చీఫ్ పదవి ఇప్పించేలా రాహుల్ గాంధీని ఒప్పించాలని తాను మధు యాష్కీని కోరానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీతో ఆయనకు కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా... ఆయనతో ఈ అంశంపై చర్చించానని తెలిపారు. అలా చేస్తే తాను మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని... ఆయన భునవగిరి ఎంపీగా పోటీ చేసేందుకు సహకరిస్తానని చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే అలా జరగలేదని... కాబట్టి తాను మునుగోడు నుంచి... తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేశామని తెలిపారు. తనకు వందల కోట్ల అప్పులు ఉన్నట్టు బయట జరుగుతుందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. టీపీసీసీ చీఫ్ పదవి తమ సోదరుల్లో ఎవరికి ఇచ్చినా ఓకే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మనుగడ సాగించలేదనే విషయాన్ని తాను గతంలో చెప్పానని... ఇప్పుడు కూడా అదే విషయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై పోరాటం చేసే విషయంలో తాను ముందుంటానని... అయితే ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందిస్తానని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: March 21, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading