కాంగ్రెస్ సాధు జంతువు... పులి లాంటి బీజేపీ... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చేరుతానని తెలిపారు.

news18-telugu
Updated: September 18, 2019, 1:41 PM IST
కాంగ్రెస్ సాధు జంతువు... పులి లాంటి బీజేపీ... కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 18, 2019, 1:41 PM IST
సాంకేతికంగా వచ్చే నాలుగేళ్లు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి... పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధుజంతువు లాంటి కాంగ్రెస్‌ను చంపి పులి లాంటి బీజేపీని సీఎం కేసీఆర్ బలపరిచారని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడటంతోనే కాంగ్రెస్ పని ఖతమైందని వ్యాఖ్యానించారు. ఉత్తమ్, కుంతియా తప్పుకుంటేనే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి... ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చేరుతానని తెలిపారు. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఓటములు ఉత్తమ్‌పై ఆధారపడి ఉంటాయని... అక్కడ తన మద్దతు ఎవరికనేది ఎన్నికలొచ్చినప్పుడు చెబుతానని అన్నారు. డిండి ప్రాజెక్ట్ భూసేకరణ నిధులు విడుదల చేయాలని మాత్రమే మంత్రి హరీశ్ రావును కలిశానని వివరించారు. కాలేజీ రోజుల నుంచే తాను, హరీశ్ రావు మంచి మిత్రులమని తెలిపారు.


First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...