news18-telugu
Updated: March 12, 2020, 6:22 PM IST
సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తనను అసెంబ్లీ నుంచి గెట్ ఔట్ అనడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. అసెంబ్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాదని మండిపడ్డారు. అలా అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తనను ఉరికించి కొడతారన్న మంత్రిని ఏమీ అనలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఆరు సంవత్సరాల నుండి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేదని... గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కృష్ణ జలాల నీళ్లు తీసుకవచ్చి తాగించామని అన్నారు. అసెంబ్లీలో నేను సభను పక్కదారి పట్టించలేదని... సభను పక్కదారి పట్టించింది సీఎం కేసీఆర్ అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (File)
తాను ఈ రోజు అసెంబ్లీలో ఉన్నానంటే అది ప్రజలు దీవెన అని వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి రావడం సీఎం పెట్టిన భిక్ష కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ప్రజల పక్షాన మాట్లాడుతానని... ప్రశ్నించే గొంతును నొక్కలని చూస్తే చూస్తూ ఉరుకోమని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బుద్ది చెప్పుతారని అన్నారు. మునుగొడుకు ఉపఎన్నిక వస్తుందని చిట్ చాట్లోమంత్రి జగదీష్ రెడ్డి అనడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు.
Published by:
Kishore Akkaladevi
First published:
March 12, 2020, 6:21 PM IST