తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున సీఎల్పీలో జరిగిన భేటీలో పాల్గొన్న జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తప్పుబట్టారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాను ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నానని.. అలాంటి తనకు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ మారాలని అనుకుంటే తనకు ఎవరూ అడ్డలేరని.. సోనియా, రాహుల్ గాంధీ మీద ఉన్న గౌరవం, విలువలతోనే పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో తనకు కూడా అభిమానులు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ కమిటీల్లో చర్చించకుండా కార్యక్రమాలు ఖరారు చేయడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..
Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?
టీపీసీసీ చీఫ్ అయిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను ఆయన కలుపుకుని ముందుకు సాగుతున్నారని ఓ వర్గం అంటుంటే.. సీనియర్ల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఆయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డికి సఖ్యత లేదని.. ఆ జాబితాలో జగ్గారెడ్డి కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీప్ కాకముందు ఆయనను వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. ఆ తరువాత ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధపడినట్టు అనిపించింది. అయితే కొద్దిరోజుల నుంచి రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య మళ్లీ గ్యాప్ పెరిగిందనే టాక్ మొదలైంది. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jaggareddy, Revanth Reddy, Telangana