‘కాంగ్రెస్‌ వల్లే కేసీఆర్‌కు సీఎం పదవి’

కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 6, 2020, 3:22 PM IST
‘కాంగ్రెస్‌ వల్లే కేసీఆర్‌కు సీఎం పదవి’
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్‌ సీఎం అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌ నాయకులు బఫూన్లు అయ్యారా ? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆరే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నంత సుఖంగా... గ్రామాల్లో రైతులు లేరని జగ్గారెడ్డి అన్నారు. సీఎం పదవి వచ్చిన తరువాత కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని ధ్వజమెత్తారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక సీఎం కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

Cm kcr, jaggareddy, congress, trs, telangana, సీఎం కేసీఆర్, జగ్గారెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలంగాణ
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)


కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌లోనే అని... ఆయన తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవిపోతేకానీ ఆయన పరపతి ఏంటో తెలుస్తుందని అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే చిల్లరగాళ్లు అయ్యారా ? అని ప్రశ్నించారు.
Published by: Kishore Akkaladevi
First published: May 6, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading